కృష్ణానదీ యాజమాన్య బోర్డును ఆంధ్రప్రదేశ్లో విజయవాడలోనే ఏర్పాటు చేసేలా కేంద్రజలశక్తి మంత్రి చొరవ చూపాలని.. తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో కోరారు.
'విజయవాడలోనే కృష్ణానదీ యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలి' - కృష్ణానదీ యాజమాన్య బోర్డు న్యూస్
కృష్ణానదీ యాజమాన్య బోర్డును విజయవాడలోనే ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని తెదేపా ఎంపీ కనకమేడల.. కేంద్రజలశక్తి మంత్రిని కోరారు. విశాఖకు మార్చవద్దని విజ్ఞప్తి చేశారు.

'విజయవాడలోనే కృష్ణానదీ యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలి'
విజయవాడలో బోర్డు ఏర్పాటుకు అధికారులంతా అంగీకరించారన్నారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చాలని పేర్కొన్నారని స్పష్టం చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విశాఖకు మార్చాలని ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ నిర్ణయం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:విద్యారంగానికి అన్ని విధాల కృషి: హరీశ్ రావు