తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా ఆధ్వర్యంలో ఘనంగా కార్తిక దీపోత్సవం - భోలక్​పూర్​ భవాని శంకర్ దేవాలయంలో దీపోత్సవం

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అధ్వర్యంలో కార్తిక మాసాన్ని పురస్కరించుకుని భవాని శంకర దేవాలయంలో దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

భాజపా ఆధ్వర్యంలో ఘనంగా కార్తిక దీపోత్సవం

By

Published : Nov 19, 2019, 2:31 PM IST

ముషీరాబాద్‌లోని భోలక్‌పూర్‌ భవాని శంకర దేవాలయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో కార్తిక దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ రామారావు ట్రస్ట్‌ ఛైర్మన్‌ శ్రీనివాస ఆధ్యాత్మిక ప్రసంగం, సుందరకాండ పారాయణం రమణీయంగా సాగింది.
అనంతరం కార్తీక దీపాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ దక్షిణ మధ్య ప్రాంత ప్రచారక్‌ శ్యామ్‌ జీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సతీమణి కవితా కిషన్‌ రెడ్డి, డాక్టర్‌ కె లక్ష్మణ్‌ వెలిగించి ప్రారంభించారు. మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జ్యోతులను వెలిగించారు.

భాజపా ఆధ్వర్యంలో ఘనంగా కార్తిక దీపోత్సవం

ABOUT THE AUTHOR

...view details