ఐడబ్ల్యూఏ డెవలప్‌మెంట్ అవార్డుకు భారత్ నుంచి హైదరాబాద్ జలమండలి ఎండీ దానకిశోర్ ఎంపికయ్యారు. జల నాయకత్వం, జల సంరక్షణ కార్యక్రమం ద్వారా నీటి వృథాను తగ్గించడం, నీటి పునర్వినియోగం, నీటి సంరక్షణ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పన వంటి అంశాలను నామినేషన్ కోసం పంపారు. ఐడబ్ల్యూఏ సెక్రటెరియట్ నుంచి దానకిశోర్‌ను అభినందిస్తూ సమాచారం వచ్చింది. అలాగే తుది ప్రజెంటేషన్‌ను సమర్పించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా నామినేషన్లను ఆహ్వానించడం ద్వారా నీటి అభివృద్ధిలో విశేష కృషి చేసినందుకు నిపుణుల బృందం ఐడబ్ల్యుఏ డెవలప్‌మెంట్ అవార్డులను ప్రదానం చేస్తోంది. ఈ ఏడాది వాటర్ డెవలప్‌మెంట్ కాంగ్రెస్ అండ్ ఎగ్జిబిషన్ డిసెంబర్ ఒకటి నుంచి ఐదో తేదీ వరకు శ్రీలంకలోని కొలంబోలో సస్టైనబుల్ సొల్యూషన్స్‌పై జరుగుతుంది.
ఐడబ్ల్యూఏ అవార్డుకు భారత్ నుంచి దానకిశోర్
ప్రతిష్ఠాత్మక ఇంటర్ నేషనల్ వాటర్ అసోషియేషన్ (ఐడబ్ల్యూఏ) అవార్డు జలమండలి ఎండీ దాన కిశోర్‌ను వరించింది. సుమారు 130దేశాల నామినేషన్‌లతో పోటీ పడి రెండవ దశను పూర్తి చేసుకుని ఫైనల్‌కు దాన కిషోర్ ఎంపికయ్యారు.
దానకిశోర్‌ను వరించిన ఐడబ్ల్యూఏ అవార్డు