TRS MLAs Poaching Case Update: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. సిట్ దర్యాప్తును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణలో భాగంగా... హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీపీ సీవీ ఆనంద్ హాజరయ్యారు. సిట్ దర్యాప్తుపై హైకోర్టుకు సీవీ ఆనంద్ నివేదిక ఇవ్వనున్నారు. పిటిషనర్ల తరఫున ప్రముఖ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసును కేవలం రాజకీయ కోణం లోనే నమోదు చేశారన్న జెఠ్మలానీ... దర్యాప్తు అధికారి నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిజాయతీగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కానీ ప్రస్తుతం దర్యాప్తు ఆ విధంగా జరగడం లేదని వాదనలు వినిపించారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసు.. హైకోర్టులో కొనసాగుతున్న విచారణ - హైకోర్టు తాజా వార్తలు
TRS MLAs Poaching Case Update: ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. సిట్ దర్యాప్తును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతోంది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హైకోర్టు విచారణకు హాజరయ్యారు. పిటిషనర్ల తరఫున మహేశ్ జెఠ్మలానీ వాదనలు వినిపిస్తున్నారు.
సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదని.... రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్.. వారి కనుసన్నల్లోనే పని చేస్తోందని తెలిపారు. ఫామ్ హౌజ్లో ఘటన జరిగిన రోజు సైబరాబాద్ సీపీ మీడియాకు వివరాలు చెప్పారని.... పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు సీజేతో పాటు మిగతా రాష్ట్రాల సీజేలకు దర్యాప్తునకు సంబందించిన సీడీ, ఇతర మెటీరియల్ను సీఎం పంపారని హైకోర్టుకు తెలిపారు. దర్యాప్తుకు సంబంధించిన ఏ విధమైన సమాచారం బయటకు పొక్కనియకుండా దర్యాప్తు అధికారి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది... కానీ ప్రస్తుతం మీడియాకు లీకులు వస్తున్నాయని తెలిపారు. దర్యాప్తు ఎలా జరగాలని పలు హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ఉటంకించిన న్యాయవాది మహేష్ జెఠ్మలానీ... ఈ కేసులో పలు ఉల్లంఘనలు జరిగాయని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు.
ఇవీ చదవండి: