తెలంగాణ

telangana

ETV Bharat / state

Pudding Pub case : ఐఫోన్​లో కీలక సమాచారం.. మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం..! - Banjara Hills Pub case

Pudding Pub case : బంజారాహిల్స్​లోని పుడింగ్ అండ్ మింక్​ పబ్​ కేసులో నిందితుల విచారణ మూడో రోజు కొనసాగుతోంది. పబ్​లో లభ్యమైన మాదకద్రవ్యాలకు తమకు ఎలాంటి సంబంధం లేదని నిందితులు చెబుతున్నారు. ఇవాళ అభిషేక్ ఐఫోన్ నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించారు.

Pudding Pub case
పుడింగ్ అండ్ మింక్​ పబ్​ కేసు

By

Published : Apr 16, 2022, 7:14 PM IST

Updated : Apr 16, 2022, 8:06 PM IST

Pudding Pub case : బంజారాహిల్స్​లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. మూడో రోజు ఇద్దరు నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పబ్​లో లభ్యమైన మాదకద్రవ్యాలకు తమకు ఎలాంటి సంబంధం లేదని పోలీసుల విచారణలో అభిషేక్, అనిల్ తెలిపారు. ఈ కేసులో అభిషేక్ ఐఫోన్ నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించారు. పుడింగ్ అండ్‌ మింక్‌ పబ్‌ లావాదేవీలపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మేనేజర్ అనిల్‌కు డ్రగ్ విక్రేతలతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.

ఇప్పటివరకు అభిషేక్‌ భాగస్వామి అర్జున్ ఆచూకీ దొరకలేదు. ఈ కేసులో పరారీలో ఉన్న అర్జున్ దొరికితే మరింత సమాచారం తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు. పబ్​పై రైడ్ చేసిన సమయంలో అర్జున్ కోల్​కతాలో ఉన్నట్లు తెలుస్తోంది. కిరణ్ రాజ్ అనే మరో భాగస్వామి అమెరికాలో ఉన్నట్లు పోలీసులకు తెలిపారు. అభిషేక్ కాల్​డేటా ఆధారంగా మరింత సమాచారం రాబట్టనున్నారు. నిందితుల యూపీఐ, బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీయనున్నారు. ఈ విచారణలో నార్కోటిక్ ఎన్​ఫోర్స్​మెంట్ వింగ్ అధికారులు కూడా పాల్గొన్నారు. నిందితులను నాలుగు రోజులు కస్టడీ తీసుకోగా.. రేపటితో ఆ గడువు ముగియనుంది.

Last Updated : Apr 16, 2022, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details