తౌక్టే తుపాను ప్రభావం నేడు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల మూడు రోజులు ఒకట్రెండు ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులో కూడిన వర్షాలు కురుస్తాయని.. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో వివరించారు.
నేడు కొన్ని జిల్లాల్లోనే తౌక్టే తుపాను ప్రభావం - తెలంగాణ వాతావరణం
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లోనే తౌక్టే తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. రాగల మూడు రోజుల్లో ఒకట్రెండు ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులో కూడిన వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు.
impact of tauktae, tauktae cyclone, tauktae thufan, hyderabad news, rain news
తౌక్టే తుపాను ఈ రోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు గోవాకి పశ్చిమ నైరుతి దిశగా 120కి.మీ.. ముంబాయి దక్షిణ దిశగా 420కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొన్నారు. ఇది క్రమంగా బలపడి రాగల 24గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనించి, గుజరాత్ తీరాన్ని పోరుబందర్, మహువాల మధ్య ఈ నెల 18వ తేదీన ఉదయం తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ సంచాలకులు తెలిపారు.
ఇదీ చూడండి:'తౌక్టే' తీవ్ర రూపం- అమిత్ షా సమీక్ష