ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పలు సంస్థలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అన్నారు. హైదరాబాద్ కొండాపూర్‌లో ఎయిర్ కండీషనర్ షోరూమ్‌ను వారు ప్రారంభించారు.
షోరూమ్‌ను ప్రారంభించిన మేయర్, ఎమ్మెల్యే - Mayor Bonthu Rammohan opened ac showroom kondapur
భాగ్యనగరం అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తెలిపారు. కొండాపూర్‌లో ఎయిర్ కండీషనర్ షోరూమ్ ప్రారంభోత్సవంలో భాగంగా వారు పేర్కొన్నారు.
షోరూమ్‌ను ప్రారంభించిన మేయర్, ఎమ్మెల్యే
నగరవాసులకు నాణ్యమైన ఎయిర్ కండీషనర్ షోరూమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన ఆ సంస్థ నిర్వాహకులను వారు అభినందించారు. అంతర్జాతీయంగా ఎంతో పేరొందిన హైదరాబాద్‌లో తమ బ్రాంచ్‌లను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.
ఇదీ చూడండి :అగ్నిప్రమాద బాధితులకు మంత్రి పరామర్శ