తెలంగాణ

telangana

ETV Bharat / state

ద.మ.రైల్వే మరో మైలురాయి.. లోడైన వందో కిసాన్ రైలు​ - Kisan train latest news

దక్షిణ మధ్య రైల్వే మరో మైలురాయిని అందుకుంది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కోసం ప్రవేశపెట్టిన కిసాన్​ రైలు నేడు వందో రైలు లోడింగ్​ అయింది. ఉల్లిపాయల లోడ్​ను పశ్చిమ బంగాకు చేరవేయనుంది.

The hundredth Kisan train is loaded today
ద.మ.రైల్వే మరో మైలురాయి.. లోడైన వందో కిసాన్ రైలు​

By

Published : Mar 15, 2021, 9:50 PM IST

రైతుల కోసం ప్రవేశపెట్టిన కిసాన్ రైలు విషయంలో దక్షిణ మధ్య రైల్వే మరో మైలురాయిని చేరుకుంది. ఇవాళ 100వ రైలు లోడింగ్ అయింది. ఆరు నెలల స్వల్ప వ్యవధిలోనే వందో రైలు నడిపినట్లు అధికారులు ప్రకటించారు.

ఉల్లిపాయల లోడ్​తో ఉన్న రైలు మహారాష్ట్రలోని నాగర్​సోల్ నుంచి పశ్చిమ బంగాకు నేడు రవాణా అయ్యింది. ఇప్పటి వరకు కిసాన్ రైళ్ల ద్వారా సుమారు 34,063 టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: దేశంలోనే తొలి కిసాన్​ రైలు సేవలు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details