తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాపై తీసుకుంటున్న చర్యలేంటి: హెచ్​ఆర్సీ - జస్టిస్ చంద్రయ్య తాజా వార్త

కరోనా నివారణ కోసం తీసుకున్న చర్యలేంటో చెప్పాలని రాష్ట్ర మానవహక్కుల కమిషన్​ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నెల 19వ తేదీలోపు రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

The Human Rights Commission has directed the state government to explain what measures the state government is taking to prevent corona
కరోనాపై తీసుకుంటున్న చర్యలేంటీ: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​

By

Published : Mar 6, 2020, 3:24 PM IST

కరోనా నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలేంటో చెప్పాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కోరింది. వైరస్ వ్యాప్తిపై వార్తా పత్రికల్లో వస్తున్న కథనాలను ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య సుమోటోగా తీసుకున్నారు. కరోనా సోకిన రోగి​కి ఎలాంటి వైద్యం అందిస్తున్నారో తెలపాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేశారు.

ప్రజల్లో అవగాహన కలిగించేందుకు తీసుకుంటున్న చర్యల వివరాలతో ఈ నెల 19వ తేదీలోపు రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ఈనెల 7న మానవ హక్కుల కమిషన్​లో నిర్వహించే సమావేశానికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు చెందిన వైద్యాధికారులు హాజరుకావాలని హెచ్చార్సీ ఆదేశాలు జారీ చేసింది.

కరోనాపై తీసుకుంటున్న చర్యలేంటీ: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​

ఇదీ చూడండి: కేసీఆర్ కృషితో ప్రగతిపథంలో రాష్ట్రం: గవర్నర్

ABOUT THE AUTHOR

...view details