వైఎస్ విజయమ్మ, షర్మిలపై పరకాల ఎన్నికల కేసుపై ప్రజా ప్రతినిధుల కోర్టు విచారణ చేసింది. విజయమ్మ, షర్మిలపై రెండు కేసులను హైకోర్టు కొట్టివేసినట్లు ఆమె తరపు న్యాయవాది వెల్లడించారు. ఐపీసీ 341 మాత్రమే కొసాగించాలని హైకోర్టు తెలిపిందని... ఆధారాలు లేనందున ఐపీసీ 341 నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.
'ఈ నెల 25న విజయమ్మ, షర్మిల విచారణకు హాజరుకావాలి' - విజయమ్మ వార్తలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2012లో పరకాల ఉపఎన్నికల్లో వైఎస్ విజయమ్మ, షర్మిల ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే అంశంపై ప్రజా ప్రతినిధుల కోర్టు విచారణ చేసింది. ఈ నెల 27న విచారణ నిమిత్తం కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.
'ఈ నెల 25న వైఎస్ విజయమ్మ, షర్మిల విచారణకు హాజరుకావాలి'
విజయమ్మ, షర్మిల న్యాయవాది అభ్యర్థనను ప్రజాప్రతినిధుల కోర్టు తోసిపుచ్చింది. కేసు పరిశీలించకుండా ఆధారాలున్నాయో లేవో నిర్ణయించలేమని తెలిపింది. తదుపరి విచారణ ఈనెల 25కు వాయిదా వేసింది. ఈ నెల 25న వైఎస్ విజయమ్మ, షర్మిల విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.