తెలంగాణ

telangana

ETV Bharat / state

AP High Court: 'పరిషత్‌ ఎన్నికల రద్దు పిటిషన్లు.. ఆగస్టు 4న విచారిస్తాం' - ఆంధ్రప్రదేశ్​ వార్తలు

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఎన్నికల సంఘం, ఎన్నికల బరిలో ఉన్న మరికొందరు అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లపై ఆగస్టు 4న విచారణ చేస్తామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. సాధ్యమైనంత త్వరగా విచారణ జరపాలని ఎస్ఈసీ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి కోరారు.

AP High Court
ఏపీ హైకోర్టు

By

Published : Jul 29, 2021, 9:23 AM IST

ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా ఏప్రిల్ 8న జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ మే 21న హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. దీనిపై ఎన్నికల సంఘం, ఎన్నికల బరిలో ఉన్న మరికొందరు అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లపై ఆగస్టు 4 న విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది.

ఎస్ఈసీ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి అప్పీళ్లపై విచారణ అంశాన్ని... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. సాధ్యమైనంత త్వరగా విచారణ జరపాలని కోరారు. అభ్యర్థనపై ధర్మాసనం స్పందిస్తూ ఆగస్టు 4వ తేదీన విచారణ చేస్తామని పేర్కొంది.

ఇదీ చదవండి:మానవీయ పరిష్కారంతో దంపతులను కలిపిన సీజేఐ

ABOUT THE AUTHOR

...view details