తెలంగాణ

telangana

ETV Bharat / state

HIGHCOURT ON GO 111: జీవో 111ను రద్దు చేస్తున్నారా...? - హైకోర్టు వార్తలు

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరీవాహకాల్లో నిర్మాణాలను నియంత్రించే జీవో 111ని రద్దు చేసే ఆలోచన ఉందా ? అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై నేడు సృష్టమైన వైఖరిని తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Hc_On_Go111
జీవో 111 పై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు.

By

Published : Aug 25, 2021, 10:14 AM IST

జీవో 111తో పాటు కోకాపేట భూముల వేలంపై దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం నిన్న విచారణ చేపట్టింది. జీవో 111ని రద్దు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారని ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ధర్మాసనం ప్రస్తావించింది.

జీవో రద్దు చేసే ఆలోచన ఉందా ? అని అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావును హైకోర్టు ప్రశ్నించింది. జీవో రద్దు చేసే ఆలోచన ఉంటే.. దానిపై తమకు ఇన్ని రోజుల పాటు విచారణ జరపాల్సిన అసరమేంటని అసహనం వ్యక్తం చేసింది.

జీవో 111ను రద్దు చేసే ఆలోచన ఉంటే ఆ విషయాన్ని ఎందుకు చెప్పడం లేదని అదనపు ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. సగం వివరాలు సమర్పించి కోర్టును ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించింది. పత్రిక కథనంపై తనకు స్పష్టత లేదని.. సీఎంను అడిగి నేడు చెబుతానని అదనపు ఏజీ తెలపడంతో కోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. ఉన్నతాధికారులను కూడా పిలిపించుకోవాలని సూచించింది.

ఇదీ చదవండి:Tolet fine: హైదరాబాద్​లో ‘టులెట్‌’కు రూ.2 వేల జరిమానా

ABOUT THE AUTHOR

...view details