HIGH COURT: ఆర్ఎంపీ, పీఎంపీల పిటిషన్పై హైకోర్టు కీలక ఆదేశం - తెలంగాణ హైకోర్టు వార్తలు
14:56 July 24
ఆర్ఎంపీ, పీఎంపీలకు శిక్షణపై హైకోర్టు కీలక ఆదేశం
తమకు పారామెడిక్స్ శిక్షణ ఇవ్వాలన్న సామాజిక వైద్యుల వినతిని పరిగణనలోకి తీసుకోవాలని వైద్యారోగ్య శాఖను హైకోర్టు ఆదేశించింది. పారామెడిక్స్ శిక్షణ ఇవ్వాలని 2015లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 428ని అమలు చేయాలని ఆర్ఎంపీ, పీఎంపీల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకన్న గత నెల 5న వైద్యారోగ్య శాఖకు వినతిపత్రం సమర్పించారు. శిక్షణ కోసం ఇప్పటికే రాష్ట్ర పారామెడికల్ బోర్డుకు ఒక్కొక్కరు 200 రూపాయలు చెల్లించి నమోదు చేసుకున్నట్లు వివరించారు.
అయితే తమ వినతిపత్రంపై వైద్యారోగ్య శాఖ స్పందించడం లేదంటూ వెంకన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆర్ఎంపీ, పీఎంపీల సంక్షేమ సంఘం వినతిని వీలైనంత త్వరగా పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషన్లోని అంశాలపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదని.. చట్టానికి అనుగుణంగా వారి వినతిని పరిగణనలోకి తీసకోవాలని పేర్కొంటూ.. విచారణ ముగించింది.