'సోమవారంలోగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించండి' - The High Court has ordered RTC workers to pay salaries on Monday
ఆర్టీసీ ఉద్యోగుల జీతాలపై దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. సోమవారం లోపు కార్మికులకు వేతన చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని న్యాయస్థానం ఆదేశించింది.
ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబరు నెలకు సంబంధించిన జీతాలను సోమవారంలోగా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. ఉద్యోగుల జీతాల చెల్లింపులపై దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. 49,190 మంది కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించేలా ఆదేశించాలని పిటినర్ కోరారు. ప్రస్తుతం సమ్మె కొనసాగుతున్నందున సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల జీతాల చెల్లింపు ఆలస్యమైందని ఆర్టీసీ యాజమాన్యం కోర్టుకు తెలిపింది. సోమవారంలోగా కార్మికులకు వేతన చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని న్యాయస్థానం ఆదేశించింది.
ఇదీ చూడండి: 'ఆర్టీసీ ఆస్తులు ప్రైవేటుపరం చేసేందుకే..'