వలసకూలీలను స్వస్థలాలకు తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బిహార్ వెళ్లేందుకు 45 మంది ఎదురుచూస్తున్నారని న్యాయవాది వసుధ నాగరాజ్ పేర్కొన్నారు. బిహార్ వెళ్లే రైలుకు అదనపు బోగీ ఎందుకు ఏర్పాటు చేయలేదని రైల్వేశాఖను హైకోర్టు ప్రశ్నించింది. ప్యాసింజర్ రైలుకు 24 బోగీలే ఉంటాయని అదనంగా ఏర్పాటు చేయరాదని రైల్వే శాఖ వెల్లడించింది.
బోగీని ఏర్పాటు చేయడానికి ఏ చట్టం అడ్డుకుంటోందని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్యాసింజర్ రైలుకు 25 బోగీలు ఉండకూడదనేందుకు కారణాలు ఉన్నాయా అని అడిగింది. పెళ్లిళ్లకు ప్రత్యేక బోగీలు సమకూర్చే రైల్వే... వలసకూలీలకు ఎందుకు చేయలేదని ప్రశ్నించింది.