TS HIGH COURT: డీజీపీ మహేందర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. సీనియర్లను పక్కన పెట్టి నిబంధనలకు విరుద్ధంగా మహేందర్ రెడ్డిని నియమించారంటూ సికింద్రాబాద్కు చెందిన విజయ గోపాల్ అనే వ్యక్తి 2017లో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీజే జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టింది. మహేందర్ రెడ్డి నియామకం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా జరిగిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.
TS HIGH COURT : 'డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం చట్టప్రకారమే జరిగింది' - తెలంగాణ వార్తలు
TS HIGH COURT: డీజీపీ మహేందర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. చట్టప్రకారమే మహేందర్ రెడ్డి నియామకం జరిగిందన్న ఏజీ వాదనతో హైకోర్టు ఏకీభవించింది.
Telangana High Court News : అర్హుల జాబితాను యూపీఎస్సీకి పంపించి.. అక్కడి నుంచి వచ్చిన ముగ్గురి పేర్లలో ఒకరిని నియమించాలన్న ప్రక్రియను అనుసరించలేదని వాదించారు. 'డీజీపీ నియామకంపై ప్రభుత్వం చట్టం చేసింది.. దానిపై దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు పెండింగ్లో ఉంది' అని ఏజీ ప్రసాద్ పేర్కొన్నారు. చట్టప్రకారమే మహేందర్ రెడ్డి నియామకం జరిగిందని.. సర్వీసు నియామకాలపై పిల్స్ విచారణ అర్హం కాదన్నారు. ఏజీ వాదనతో ఏకీభవించిన హైకోర్టు నియామకంలో ప్రజా ప్రయోజనాలు ఏముంటాయని ప్రశ్నిస్తూ.. పిల్ విచారణార్హం కాదని కొట్టివేసింది.
ఇదీ చదవండి:హోంమంత్రిని తొలగించాలంటూ నిరసనలు.. లాఠీఛార్జ్ చేసిన పోలీసులు