తెలంగాణ

telangana

ETV Bharat / state

'వారికి రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లేవు' - latest high court news

సమాచార హక్కు కమిషనర్ల నియామకాల అభ్యంతరాలపై హైకోర్టు విచారణ ముగించింది. సహ కమిషనర్లుగా నియమితులైన వారికి రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నట్లు లేఖలో ఎలాంటి ఆధారాలు లేనందున పిటిషన్​పై విచారణ ముగిస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది.

The High Court has concluded its inquiry into the objections to the appointment of Right to Information Commissioners.
వారికి రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లేవు: హైకోర్ట్​

By

Published : Jan 25, 2021, 9:21 PM IST

సమాచార హక్కు కమిషనర్ల నియామకాల అభ్యంతరాలపై హైకోర్టు విచారణ ముగించింది. పిల్​పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సహ కమిషనర్లుగా నియమితులైన వారికి రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నట్లు లేఖలో ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని అమికస్ క్యూరీ వసుధ నాగరాజు హైకోర్టుకు నివేదించారు. ఆధారాలు లేనందున పిటిషన్​పై విచారణ ముగిస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది.

గతంలో సమాచార హక్కు కమిషనర్లుగా నియమితులైన.. కట్టా శేఖర్ రెడ్డి, నారాయణ రెడ్డి, సయ్యద్ ఖలీలుల్లా, మొహమ్మద్ అమీర్, గుగులోత్ శంకర్ నాయక్ నియామకం ఆర్టీఐ చట్టానికి విరుద్ధంగా ఉందని... హైదరాబాద్​కు చెందిన వేణు చెగ్యాం రాసిన లేఖ రాశారు. ఆ లేఖను హైకోర్ట్​ సుమోటో, ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. అయితే ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో ఉన్నత న్యాయస్థానం నేడు విచారణను ముగిస్తున్నట్లు పేర్కొంది.

ఇదీ చూడండి:'ఫిబ్రవరి 1న దిల్లీలో పాదయాత్ర చేపడుతాం'

ABOUT THE AUTHOR

...view details