కాళేశ్వరం ప్రాజెక్టు అప్రోచ్ కాలువలు, డిస్ట్రిబ్యూటరీ ఛానెళ్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన భూ సేకరణ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. భూ సేకరణను సవాల్ చేస్తూ నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఎలిమినేడు గ్రామానికి చెందిన పలువురు భూ నిర్వాసిత రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్.నందా ధర్మాసనం విచారణ జరిపింది. కాలువలకు భూసేకరణ కోసం 2017లో జారీ చేసిన నోటిఫికేషన్ గడువు ముగిసినప్పటికీ.. ప్రభుత్వం భూములు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోందని పిటిషనర్లు వాదించారు. పరిహారం చెల్లించకుండా బలవంతంగా భూములు స్వాధీనం చేసుకుంటోందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణపై దాఖలైన పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు - కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణపై దాఖలైన పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు
20:06 August 01
కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణపై దాఖలైన పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు
పిటిషనర్లు మినహా గ్రామంలోని రైతులందరూ పరిహారం తీసుకున్నారని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. పిటిషనర్లు కూడా ప్రభుత్వం ప్రతిపాదించిన పరిహారం ప్యాకేజీని గతంలో అంగీకరించారని.. ఇప్పుడు మళ్లీ పెంచాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. ప్రభుత్వం ప్యాకేజీని అంగీకరించి.. ఆ తర్వాత పిటిషన్లు వేయడం సరికాదని అభిప్రాయపడింది.
ఇవీ చూడండి..