తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ హైకోర్టులో వైకాపా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

పంచాయితీ కార్యాలయాలపై వైకాపా రంగుల అంశంపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. పదిరోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జీవో నంబర్ 623ని సస్పెండ్ చేస్తూ న్యాస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

the high court dismissed the go issued by the ap government on the issue of ycp colors on panchayat offices
హైకోర్టులో వైకాపా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

By

Published : May 5, 2020, 5:29 PM IST

పంచాయితీ కార్యాలయాలపై రంగుల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 623ను సస్పెండ్ చేస్తూ ఆ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రంగుల ఆంశంలో హైకోర్టు, సుప్రీంకోర్డు తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో విడుదల చేసిందని న్యాయవాది సోమయాజులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పంచాయితీ కార్యాలయాలపై వేసిన వైకాపా రంగులను మూడు వారాల్లోగా తొలగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

రంగులు తొలగించాకే ఎన్నికలు నిర్వహించాలని గతంలోనే హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం పంచాయితీ కార్యాలయాల రంగుల విషయంలో 623జీవోను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న రంగులకు అదనంగా ఓ రంగును వేయాలని జీవోలో పేర్కొందని పిటిషినర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వైకాపా జెండాను పోలి ఉన్న రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశిస్తే.. దానికి విరుద్ధంగా ప్రభుత్వం తొలగించడానికి బదులు అదనంగా మరో రంగును జత చేస్తూ జీవో జారీ చేయడం తీర్పునకు విరుద్ధమని న్యాయవాది వాదించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలతో పది రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.


ఇదీ చూడండి:కేసుల సంఖ్య తగ్గించి చెబుతున్నారు: బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details