తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆలయాలకు కానుకలపై కౌంటరు సమర్పించండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

Telangana High Court News : 2015లో ఆలయాలకు కానుకలు సమర్పిస్తూ జారీ అయిన ఉత్వర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై కౌంటర్​ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కేసును నవంబర్​కు వాయిదా వేసింది. గతంలో ఆలయాలకు కానుకలు సమర్పిస్తూ జారీ అయిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రచయిత కంచ ఐలయ్య, గుండముల రాములు ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు.

Telangana High Court News
High Court

By

Published : Sep 6, 2022, 10:26 AM IST

Telangana High Court News: ఆలయాలకు కానుకలు సమర్పిస్తూ జారీ అయిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లలో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సోమవారం ఆదేశించింది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి, విజయవాడ కనకదుర్గ, తిరుచానూరు పద్మావతి, భద్రకాళి, వీరభద్రస్వామి ఆలయాలకు కానుకల సమర్పణకు సంబంధించి ప్రభుత్వం 2015లో జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ గతంలో రచయిత కంచ ఐలయ్య, గుండమల రాములు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

దీనిపై సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడానికి తగిన కారణాలున్నాయని తెలిపారు. వీటన్నింటినీ వివరిస్తూ కౌంటరు దాఖలు చేయడానికి 6 వారాల గడువు కావాలని కోరడంతో విచారణను హైకోర్టు నవంబరుకు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details