'ఉస్మానియా ఆసుపత్రి అన్ని పిటిషన్లను ఒకేసారి విచారిస్తాం' - ఉస్మానియా ఆసుపత్రి తాజా వార్తలు
15:39 August 17
'ఉస్మానియా ఆసుపత్రి అన్ని పిటిషన్లను ఒకేసారి విచారిస్తాం'
ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ వివాదంపై విచారణను హైకోర్టు ఈనెల 24కి వాయిదా వేసింది. ఆసుపత్రికి సంబంధించిన కొన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యాలు ఉన్నత న్యాయస్థానం ముందు విచారణకు వచ్చాయి. ఈ క్రమంలో ఆసుపత్రికి సంబంధించిన మరికొన్ని పిల్స్ కూడా ఉన్నాయని.. వాటి వివరాలు కూడా రిజిస్ట్రీకి ఇవ్వాలని ఏజీని కోరిన ధర్మాసనం.. అన్నీ కలిపి విచారణ జరుపుతామని పేర్కొంది.
వందేళ్లక్రితం నిర్మించిన ఉస్మానియా ఆసుపత్రి.. శిథిలావస్థకు చేరి రోగులు, వైద్య సిబ్బందికి ప్రమాదకరంగా పరిణమించిందని ఏజీ ప్రసాద్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కొందరు ఉస్మానియా భవనం కూల్చి.. కొత్తగా నిర్మించాలంటున్నారని, మరికొందరు భవనం కూల్చకుండా అడ్డుకోవాలని అంటున్నారని హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ముక్కలు ముక్కలుగా వాదనలు వినలేమన్న ధర్మాసనం.. అన్ని పిల్స్‌పై విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది.
ఇవీ చూడండి: వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యున్నత స్థాయి సమీక్ష