తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రేమోన్మాది దాడి: నిలకడగా యువతి ఆరోగ్యం - ప్రేమోన్మాది దాడి

చైతన్యపురి లాడ్జీలో ప్రేమోన్మాది దాడికి గురై తీవ్రంగా గాయపడిన యువతి అత్యవసర విభాగంలో చికిత్సపొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. నిందితుడు వెంకటేశ్​ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అత్సవసర విభాగంలో చికిత్స పొందుతున్న యువతి

By

Published : Jul 11, 2019, 12:03 AM IST

దిల్​సుఖ్​నగర్​లోని బృందావన్ లాడ్జీలో ప్రేమోన్మాది దాడికి గురై గాయపడిన యువతి అత్యవసర చికిత్స విభాగంలో ఉంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెకు శస్త్ర చికిత్స చేశారు. నిందితుడు వెంకటేశ్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రికి వచ్చిన నిందితుడి తల్లిదండ్రుల నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. వ్యవసాయ నేపథ్యం కలిగిన కుటుంబానికి చెందిన వేంకటేశ్​కు స్నేహితులు తక్కువేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం వెంకటేశ్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నందున అతని నుంచి పోలీసులు ఎలాంటి సమాచారం సేకరించలేకపోయారు.

అత్సవసర విభాగంలో చికిత్స పొందుతున్న యువతి

ABOUT THE AUTHOR

...view details