తెలంగాణ

telangana

ETV Bharat / state

1996లో శిక్ష... 18 సంవత్సరాల తర్వాత ప్రత్యక్షం! - 18 ఏళ్ల తర్వాత దొరిగిన నేరాస్థుడు

1996లో శిక్ష పడింది. కానీ.. అప్పటినుంచి ఆ నేరస్థుడు మాయమైపోయాడు. పోలీసుల కళ్లకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఎట్టకేలకు 18 సంవత్సరాల తర్వాత చిక్కాడు. ఇంతకీ అతడెవరు... ఆ శిక్షేంటి.. తెలియాలంటే...

ఖాజీ ఫయాజుద్దీన్‌

By

Published : Sep 19, 2019, 10:43 PM IST

Updated : Sep 20, 2019, 12:01 AM IST


జనగాం జిల్లా కేంద్రం గీతానగర్‌కు చెందిన ఖాజీ ఫయాజుద్దీన్‌ 1993 సంవత్సరంలో ఫాతిమా పర్వీన్‌ను వివాహం చేసుకున్నాడు. భర్త వేధింపులతో ఆమె 1994లో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు ఓయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫయాజుద్దీన్‌ అతని కుటుంబసభ్యులపైన కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి నాంపల్లి మహిళా కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

3 సంవత్సరాల శిక్ష ..

1996లో కోర్టు ఫయాజుద్దీన్‌కు 3 సంవత్సరాల శిక్ష విధించింది. అతని కుటుంబసభ్యులకు మాత్రం ఊరట కల్పించిందికోర్టు విధించిన శిక్షపై అతను హైకోర్టులో అప్పీల్‌ చేసుకున్నాడు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం 3 సంవత్సరాల శిక్షను ఒక్క సంవత్సరానికి తగ్గించింది. అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. కోర్టు అతనిపై అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. 18 సంవత్సరాల తర్వాత ఓయూ పోలీసులు ఫయాజుద్దీన్‌ను అరెస్టు చేసి... కోర్టులో హాజరుపరచి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఇవీ చూడండి: చేతబడి నెపంతో వ్యక్తి దారుణ హత్య

Last Updated : Sep 20, 2019, 12:01 AM IST

ABOUT THE AUTHOR

...view details