తెలంగాణ

telangana

ETV Bharat / state

సైకిల్​పై ఫుడ్​ డెలివరీ.. దాతల సాయంతో కొత్త బైక్.. - hyderabadi delivery boy on cycle

కరోనా మహమ్మారి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు సృష్టిస్తున్నా పేద, మధ్య తరగతి ప్రజలు ఏదో ఒక విధంగా తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మనసుంటే మార్గాలు ఎన్నో ఉంటాయి అన్నట్లుగా జీవనోపాధి కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అదే బాటలో హైదరాబాద్​కు చెందిన ఓ ఇంజనీరింగ్​ విద్యార్థి మహ్మద్​ అకీల్​.. తన కుటుంబ పోషణ కోసం జొమాటాలో డెలివరీ బాయ్​గా పనిచేస్తున్నాడు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. బైక్​ లేకపోయినా సైకిల్​పై దాదాపు 80కి.మీలు ప్రయాణిస్తూ ఫుడ్​ డెలివరీ చేస్తున్నాడు. అతని కష్టాన్ని గుర్తించిన ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల ద్వారా నిధులు సమకూర్చారు. అకీల్​ కోసం బైక్​ కొనుగోలు చేసి కానుకగా ఇస్తున్నారు.

hyderabadi delivery boy on cycle
సైకిల్​పై ఫుడ్​ డెలివరీ​

By

Published : Jun 16, 2021, 2:28 PM IST

Updated : Jun 16, 2021, 3:01 PM IST

హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి మహ్మద్ అకీల్‌ది నిరుపేద కుటుంబం. తండ్రి చెప్పులు తయారు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. లాక్​డౌన్​ ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో అకీల్​ జొమాటోలో ఫుడ్​ డెలివరీ బాయ్​లా జాయిన్ అయ్యాడు. బైక్​ లేకపోయినా సైకిల్​పై దాదాపు 80 కి.మీలు ప్రయాణిస్తూ ఫుడ్​ డెలివరీ చేస్తున్నాడు. సైకిల్​పై అన్ని కిలోమీటర్లు వెళ్లడం కష్టమైనా తన కుటుంబ పోషణ కోసం తప్పదని.. తాను ఇంకా బాగా చదువుకోవాలనుకుంటున్నానని 'ఈటీవీ భారత్'​తో అకీల్​ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

దాతల విరాళాలపై కృతజ్ఞతలు

'ఈటీవీ భారత్‌ ఉర్దూ'లో ప్రసారమైన కథనాన్ని చూసి 'ది గ్రేట్​ హైదరాబాద్​ ఫుడ్ అండ్ ట్రావెల్​ క్లబ్​ ' అకీల్​కు సాయం చేయాలని నిర్ణయించుకుంది. అకీల్​కు బైక్​ కొనివ్వడం కోసం ఆ సంస్థ సభ్యుడు రాబిన్​ ముకేష్​.. సామాజిక మాధ్యమాల ద్వారా విరాళాలు సేకరించారు. 24 గంటల్లోనే రూ. 73,370 సేకరించారు. ఈ డబ్బుతో అకీల్​కు రెండు రోజుల్లో ద్విచక్ర వాహనాన్ని కొనిస్తామని తెలిపారు. సాయం చేసిన దాతలకు, 'ది గ్రేట్​ హైదరాబాద్​ ఫుడ్ అండ్​ ట్రావెల్​ క్లబ్​ ' సంస్థకు, ఈటీవీ భారత్‌కు అకీల్‌ కృతజ్ఞతలు తెలిపారు.

బైక్​ ఖరీదు వివరాలు

ఇదీ చదవండి:తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు

Last Updated : Jun 16, 2021, 3:01 PM IST

ABOUT THE AUTHOR

...view details