నిరుద్యోగులకు అన్యాయం చేస్తే వదిలి పెట్టేది లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. హైదరాబాద్, బీఆర్కే భవన్లో సీఎస్ సోమేశ్‌కుమార్‌తో కలిసి ఉద్యోగ నియామకాల అంశంపై చర్చించినట్లు ఆయన తెలిపారు.
ఐఏఎస్ అధికారులు కుమ్మక్కై.. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను తగ్గిస్తున్నారని కృష్ణయ్య ఆరోపించారు. పోస్టులను దొడ్డిదారిన పదోన్నతులతో నింపుతున్నారని విమర్శించారు.