లాక్డౌన్ సమయంలో పారిశుద్ధ్య కార్మికులతో పాటు ప్రజలందరికీ అన్ని సదుపాయాలు కల్పిస్తామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చెప్పారు. హైదరాబాద్ మియాపూర్‌లోని జయప్రకాశ్ నగర్‌లో పారిశుద్ధ్య కార్మికులకు ఎంజీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పాల్గొని వారికి దుస్తులు అందజేశారు. మే డేను పురస్కరించుకుని కార్మికులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తమ ట్రస్టు తరఫున నిత్యం 500మందికి భోజనాలు అందిస్తున్నట్లు ట్రస్ట్ ఛైర్మన్ గంగాధర్‌రావు వెల్లడించారు.
ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుంది : ఎమ్మెల్యే గాంధీ - ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దుస్తుల వితరణ
కరోనా కష్టకాలంలో ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలిపారు. హైదరాబాద్ మియాపూర్‌లోని జయప్రకాశ్ నగర్‌లో పారిశుద్ధ్య కార్మికులకు ఎంజీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాంధీ పాల్గొని వారికి దుస్తులు అందించారు.
![ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుంది : ఎమ్మెల్యే గాంధీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7017753-328-7017753-1588333237652.jpg)
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ