తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నాం'

హైకోర్టుకు నివేదిక సమర్పించిన ప్రభుత్వం
హైకోర్టుకు నివేదిక సమర్పించిన ప్రభుత్వం

By

Published : Jun 1, 2021, 10:43 AM IST

Updated : Jun 1, 2021, 11:29 AM IST

10:41 June 01

'కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నాం'

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ప్రజారోగ్య సంచాలకులు, డీజీపీ, కార్మిక, జైళ్ల శాఖలు, జీహెచ్​ఎంసీ వేర్వేరుగా నివేదికలు అందించాయి. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచుతున్నామని.. గత నెల 29న లక్ష నిర్ధారణ పరీక్షలు చేసినట్లు నివేదికలో డీహెచ్​ శ్రీనివాసరావు వెల్లడించారు. రెండో దశ ఫీవర్ సర్వేలో 68.56 మందికి పరీక్షలు చేశామని వివరించారు. ప్రైవేట్​ ఆస్పత్రులపై వచ్చిన ఫిర్యాదులు పరిశీలిస్తున్నామని.. ఇందుకు సంబంధించి ముగ్గురు ఐఏఎస్​లతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికే 79 ఆస్పత్రులకు 115 షోకాజ్ నోటీసులు జారీ చేశామన్న డీహెచ్.. ఇప్పటి వరకు 10 ఆసుపత్రుల కరోనా చికిత్స లైసెన్సులు రద్దుచేసినట్లు నివేదికలో వెల్లడించారు.

మూడో దశను ఎదుర్కొనేందుకు చర్యలు..

రాష్ట్రంలో ఇప్పటి వరకు 744 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు డీహెచ్​ తెలిపారు. బ్లాక్‌ఫంగస్ ఔషధాలకు దేశ వ్యాప్తంగా కొరత ఉందన్న ఆయన.. వీటిని తీర్చేందుకు ఔషధాలు కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు 1,500 పడకలు అందుబాటులో ఉన్నాయని నివేదికలో తెలిపారు. కరోనా చికిత్సకు తగినన్ని ఆస్పత్రులు, పడకలు ఉన్నాయని డీహెచ్​ నివేదికలో తెలిపారు. ఈ సందర్భంగా కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న ప్రజారోగ్యసంచాలకులు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పడకలు పెంచుతున్నామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ప్రియురాలి కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన యువకుడు.. నాలుగేళ్ల తర్వాత అప్పగింత

Last Updated : Jun 1, 2021, 11:29 AM IST

ABOUT THE AUTHOR

...view details