తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాపై పోరుకు ప్రత్యేక ప్రణాళిక అవసరం: ఉత్తమ్ - pcc chief Uttam Kumar Reddy

కరోనా నేపథ్యంలో సంఘటిత, అసంఘటిత రంగాల్లోని లక్షలాది మంది ఉద్యోగాలు పోయాయని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లాక్​డౌన్​ అనంతరం రాష్ట్రంలో నిరుద్యోగ యువకుల సంఖ్య రెట్టింపు అవుతుందని.. పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన సూచించారు.

The government should prepare a special plan: Uttam Kumar Reddy
ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలి: ఉత్తమ్​కుమార్​రెడ్డి

By

Published : Apr 30, 2020, 11:27 AM IST

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భృతి చెల్లించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్​రెడ్డి డిమాండ్‌ చేశారు. లాక్​డౌన్ వల్ల ఇప్పటికే అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థ కారణంగా సంఘటిత, అసంఘటిత రంగాల్లోని లక్షలాది మంది ఉద్యోగాలు పోయాయని ఆయన ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు.

అనేక రంగాలు కోలుకోడానికి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేందుకు కనీసం ఏడాది పడుతుందని ఉత్తమ్​ పేర్కొన్నారు. లాక్​డౌన్ ముగియడానికి 7 రోజులు మిగిలి ఉన్నాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ఉండాలని సూచించారు.

అనేక ఐటీ కంపెనీలు, ఎస్‌ఎంఇలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించాయని.. రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేదని ఉత్తమ్​కుమార్​రెడ్డి ధ్వజమెత్తారు. అనేక దేశాల్లో ఆయా ప్రభుత్వాలు.. తమ సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు వీలుగా ప్రైవేటు సంస్థలకు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించాయని.. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆ దిశలో నిర్ణయం తీసుకోవాలన్నారు.

లాక్​డౌన్​ అనంతరం రాష్ట్రంలో నిరుద్యోగ యువకుల సంఖ్య రెట్టింపు అవుతుందని, పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం, కరోనా తాజా పరిస్థితులపై స్థితి నివేదికను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదీచూడండి: లాక్​డౌన్​ తర్వాత... టైర్​-1నగరాలకే విమాన సర్వీసులు!

ABOUT THE AUTHOR

...view details