భగవంతుడిని పూజించడం.. నిమజ్జనం చేయడం ప్రజల హక్కని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్‌రావు పేర్కొన్నారు. గణేశ్ నిమజ్జనం సాఫీగా సాగేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. నిమజ్జనం విషయంలో హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలని భగవంత్ రావు సూచించారు.
ఈ సందర్భంగా గణేశ్ విగ్రహాలతో నీరు కలుషితం అవుతుందనేది ఎక్కడా రిపోర్టులో లేదని భగవంత్‌రావు స్పష్టం చేశారు. నాలాల కలుషిత నీటితోనే హుస్సేన్‌సాగర్ నీరు కలుషితం అవుతుందన్నారు. గణేశ్ నిమజ్జనం ద్వారా హుస్సేన్‌సాగర్ కలుషితం అవుతుందని ఎవరు తేల్చారని భగవంత్‌రావు ప్రశ్నించారు. రసాయన విగ్రహాల ద్వారా నీరు కలుషితం అవుతందని ఎక్కడా రిపోర్టుల్లో లేదన్నారు. ప్రభుత్వ అధికారులే కోర్టుకు తప్పుడు రిపోర్టులు సమర్పించారని ఆయన ఆరోపించారు. కోర్టుకు సరైన వివరాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు.
ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు..