లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం రూ.5 వేలు అందించాలని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. 80 శాతం మంది రేషన్ బియ్యం తినడం లేదని.. వేరే బియ్యం కొనుగోలు చేసి తింటున్నారని వ్యాఖ్యానించారు. రేషన్ దుకాణాల ద్వారానే మంచి బియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
రాష్ట్రంలోని దీపం లబ్ధిదారులందరికి ఒక సిలిండర్ ఉచితంగా ఇవ్వాలని ఉత్తమ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో చిక్కుకుపోయిన వలస కూలీలు ఆందోళనగా ఉన్నారని.. సహాయ చర్యలు పెంచాలని సూచించారు.