తెలంగాణ

telangana

ETV Bharat / state

21 జిల్లాల్లో ఆయుధ లైసెన్సులు రద్దు - తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల వార్తలు

రాష్ట్రంలో పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 21 జిల్లాల్లో ఆయుధ లైసెన్సులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. లైసెన్స్​దారులు వారి ఆయుధాలను పోలీసులు, ఆయుధాల డీలర్ల వద్ద జమ చేయాలని సూచించింది.

The government revoked arms license in telangana 21 districts
21 జిల్లాల్లో ఆయుధ లైసెన్సులు రద్దు

By

Published : Feb 19, 2021, 4:58 PM IST

పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆయుధ లైసెన్సులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పరిధిలో ఆయుధాల లైసెన్సులపై సస్పెన్షన్ విధించారు.

మొత్తం 21 జిల్లాల కలెక్టర్ల పరిధిలో లైసెన్సులు సస్పెండ్ చేశారు. లైసెన్సుదారులు వారి ఆయుధాలను పోలీసులు, ఆయుధాల డీలర్ల వద్ద జమ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపింది. ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చూడండి :కిడ్నాపైన బాలుడిని రక్షించిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details