పీఆర్సీ ప్రతిపాదించిన ఏడున్నర శాతం ఫిట్‌మెంట్‌పై భాజపా ఎమ్మెల్సీ రామచంద్రరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మెరుగైన వేతన సవరణ కోసం ఉద్యోగులు ఎలాంటి ఆందోళనలు చేసినా.. భాజపా వారి వెంట ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. సచివాలయంలో సీఎస్ సోమేశ్ కుమార్ను కలిసి.. పీఆర్సీ నివేదిక, సంబంధిత అంశాలపై చర్చించారు.
'ప్రభుత్వం ఉద్యోగుల జీతాలను తగ్గించాలని చూస్తోంది' - ఏడున్నర శాతం ఫిట్‌మెంట్
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను భాజపా ఎమ్మెల్సీ రామచంద్రరావు కలిశారు. పీఆర్సీ నివేదిక, సంబంధిత అంశాలపై చర్చించారు.
'ప్రభుత్వం ఉద్యోగుల జీతాలను తగ్గించే దిశగా పనిచేస్తోంది'
ప్రభుత్వం.. ఉద్యోగుల జీతాలను తగ్గించే దిశగా పనిచేస్తోందని రామచంద్రరావు మండిపడ్డారు. బిస్వాల్ కమిటీ ప్రభుత్వ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టకపోవడం శోచణీయమన్నారు.