సీబీఐ దర్యాప్తునకు అనుమతి లేదు.. 2నెలల క్రితమే ఉపసంహరించిన ప్రభుత్వం - ఇక రాష్ట్రంలోకి సీబీఐ నో ఎంట్రీ
11:02 October 30
రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు అనుమతి ఉపసంహరించిన ప్రభుత్వం
రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు అనుమతి లేకుండా రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేసే అవకాశం లేకుండా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పరిధిలో ఏ కేసులోనైనా, ఎప్పుడైనా దర్యాప్తు చేసేలా గతంలో ఇచ్చిన సాధారణ అనుమతులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. రాష్ట్ర హోం శాఖ ఆగస్టు 30న జీవో 51 జారీ చేసింది. రెండు నెలల క్రితమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ గోప్యంగా ఉంచింది.
ఎమ్మెల్యేలకు ఎర అంశాన్ని సీబీఐకి అప్పగించాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం సీబీఐ.. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అదనపు ఏజీ రామచంద్రరావు హైకోర్టుకు నివేదించారు. కాబట్టి ప్రభుత్వం అనుమతి లేకుండా సీబీఐ దర్యాప్తును కోరలేరని వాదించారు. భాజపా, తెరాస మధ్య రాజకీయ వేడి నేపథ్యంలో ప్రభుత్వం గతంలోనే తీసుకున్న ఈ నిర్ణయం కీలక చర్చకు దారి తీసింది. సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఇది రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇవీ చదవండి: