తెలంగాణ

telangana

ETV Bharat / state

పింఛన్లలో కోత విధించే అధికారం ప్రభుత్వానికి లేదు: హైకోర్టు - Telangana High court verdict on Employees Pensions

విశ్రాంత ఉద్యోగుల పింఛన్లలో కోతపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పెన్షనర్ల ఐకాస తరఫు న్యాయవాది వాదించారు. ఈ విషయమై ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

The government has no right to deduct Employees pensions said by Telangana High court
పింఛన్లలో కోత విధించే హక్కు ప్రభుత్వానికి లేదు

By

Published : Jun 24, 2020, 7:42 PM IST

రాష్ట్రంలోని ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల కోతకు సంబంధించిన ఆర్డినెన్స్​ను సవాల్ చేస్తూ పెన్షనర్ల జేఏసీ దాఖలు చేసిన సవరణ పిటిషన్​ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఫించన్​లో కోతపై దాఖలైన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని జేఏసీ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు.

ఆర్డినెన్స్ కొట్టివేయాలని కోరుతూ తమ పిటిషన్​ను సవరించాలని కోరారు. గవర్నర్, రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చాలని కోరారు. గవర్నర్​ను ప్రతివాదిగా చేర్చేందుకు హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. పిటిషన్​ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి: 'వివాదాల పరిష్కారానికి సరైన మార్గాలు అన్వేషించాలి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details