తెలంగాణ

telangana

ETV Bharat / state

Super‌ Spreaders: 'వ్యాక్సిన్​ కోసం ఆన్​లైన్​లో నమోదు చేసుకోవాల్సిందే..!'

కరోనా కట్టడిలో భాగంగా జీహెచ్ఎంసీ (Ghmc) పరిధిలో ఏర్పాటు చేసిన సూపర్ స్ప్రెడర్ల వ్యాక్సిన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. వ్యాక్సిన్ పంపిణీని మరింత వేగవంతం చేసే దిశగా నమోదు ప్రక్రియలో ప్రభుత్వం నేడు సరికొత్త ఆన్​లైన్​ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. మున్సిపల్ సిబ్బంది వద్ద రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి వ్యాక్సిన్ వేసే ప్రసక్తే లేదని సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ తేల్చి చెప్పారు.

super spiders vaccine programme
super spiders vaccine programme

By

Published : Jun 3, 2021, 4:14 PM IST

Updated : Jun 3, 2021, 4:36 PM IST

ప్రభుత్వం.. జీహెచ్ఎంసీ (Ghmc) పరిధిలో కరోనా నియంత్రణలో భాగంగా ప్రవేశపెట్టిన సూపర్‌ స్ప్రెడర్ల (Super‌ Spreaders) ప్రత్యేక వాక్సినేషన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఆరు రోజులుగా వ్యాక్సిన్ నమోదు ప్రక్రియ (Vaccine registration process) విధానంలో రోజురోజుకు మార్పులు తీసుకువస్తూ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఈ కార్యక్రమం మరింత సజావుగా సాగేందుకు.. వ్యాక్సిన్ నమోదులో ప్రభుత్వం నేడు సరికొత్త ఆన్​లైన్​ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ముషీరాబాద్ వ్యాక్సినేషన్ కేంద్రంలో.. ఆన్​లైన్​ నమోదు ప్రక్రియను సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.

సికింద్రాబాద్ జోన్ పరిధిలో 150 మందితో టీంను ఏర్పాటు చేసి.. ప్రతి ప్రాంతంలో ఆన్​లైన్​ నమోదు ప్రక్రియను చేపడుతున్నట్లు శ్రీనివాస్ రెడ్డి వివరించారు. మున్సిపల్ సిబ్బంది వద్ద రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి వ్యాక్సిన్ వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వ్యాక్సిన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా కొనసాగించే దిశగా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:KTR: 'హెల్త్‌కేర్ వర్కర్లను దేవునితో సమానంగా చూస్తున్నారు'

Last Updated : Jun 3, 2021, 4:36 PM IST

ABOUT THE AUTHOR

...view details