తెలంగాణ

telangana

ETV Bharat / state

మరో 1,663 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి

మరో 1,663 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి
మరో 1,663 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి

By

Published : Jul 2, 2022, 3:42 PM IST

Updated : Jul 2, 2022, 4:21 PM IST

15:41 July 02

మరో 1,663 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్న ప్రభుత్వం.. మరో 1,663 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 1,663 ఖాళీల్లో.. ఇంజినీరింగ్ విభాగంలో 1,522 పోస్టులు భర్తీ చేయనున్నారు. కొత్తగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.

  • నీటి పారుదల శాఖలో 704 ఏఈఈ పోస్టులు
  • నీటి పారుదల శాఖలో 227 ఏఈ పోస్టులు
  • నీటి పారుదల శాఖలో 212 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
  • నీటి పారుదల శాఖలో 95 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
  • భూగర్భ జలశాఖలో 88 పోస్టుల భర్తీకి అనుమతి
  • ఆర్ అండ్ బీలో 38 సివిల్ ఏఈ పోస్టులు
  • ఆర్ అండ్ బీలో 145 సివిల్ ఏఈఈ పోస్టులు
  • ఆర్ అండ్ బీలో 13 ఎలక్ట్రికల్ ఏఈఈ పోస్టులు
  • ఆర్ అండ్ బీలో 60 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
  • ఆర్ అండ్ బీలో 27 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
  • ఆర్థికశాఖలో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు

తాజా అనుమతులతో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 46,998 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చినట్లయింది. మిగిలిన పోస్టుల భర్తీకీ అనుమతుల ప్రక్రియను ఆర్థికశాఖ ముమ్మరం చేసింది. త్వరలోనే ఆ పోస్టుల భర్తీకీ అనుమతులు ఇవ్వనున్నారు.

ఇవీ చూడండి..

ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు తీపికబురు.. 1,433 ఉద్యోగాల భర్తీకి అనుమతి

Modi Hyderabad Tour: భాగ్యనగరానికి చేరుకున్న ప్రధాని మోదీ..

Last Updated : Jul 2, 2022, 4:21 PM IST

ABOUT THE AUTHOR

...view details