తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో మరో 86 గురుకుల పాఠశాలలకు జూనియర్ కళాశాల స్థాయి..

రాష్ట్రంలో మరో 86 గురుకుల పాఠశాలల స్థాయి పెంచాలని ప్రభుత్వం నిర్ణయం
రాష్ట్రంలో మరో 86 గురుకుల పాఠశాలల స్థాయి పెంచాలని ప్రభుత్వం నిర్ణయం

By

Published : Jul 1, 2022, 4:44 PM IST

Updated : Jul 1, 2022, 9:47 PM IST

16:42 July 01

86 గురుకులాలకు జూనియర్ కళాశాల స్థాయి కల్పిచాలని ప్రభుత్వం నిర్ణయం

Gurukula Schools: రాష్ట్రంలో మరో 86 గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాల స్థాయికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురుకులాలను కళాశాల స్థాయి పెంపుపై అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. బీసీ-4, ఎస్సీ-75, ఎస్టీ-7 గురుకులాలను కళాశాలలుగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు అధికారులతో సీఎస్ సోమేశ్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా గురుకులాల్లో పరిశుభ్రత కోసం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించేందుకు, వంటసిబ్బందికి శిక్షణ ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని.. స్టడీసర్కిళ్ల ఏర్పాటుపై అధికారులు నివేదిక రూపొందించాలని సీఎస్ సూచించారు.

ఇదీ చదవండి:వెంకన్న భక్తులకు టీఎస్​ఆర్టీసీ లడ్డూలాంటి ఆఫర్​.. ఈరోజు నుంచే అమలు..

ట్రాక్టర్లతో 'టగ్​ ఆఫ్​ వార్'​.. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు.. వీడియో వైరల్​!

Last Updated : Jul 1, 2022, 9:47 PM IST

ABOUT THE AUTHOR

...view details