తెరాస ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని తెదేపా నేతలు ఆరోపించారు. హైదరాబాద్ దోమలగూడ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న 7లక్షల మందిలో ఒక్కరికి కూడా ఇల్లు మంజూరైన దాఖలాలు లేవని మండిపడ్డారు. తమ పార్టీని వీడిన వారిని విమర్శంచబోమని పేర్కొన్నారు. తెదేపా ఒక విశ్వవిద్యాలయమని, బడుగు, బలహీన వర్గాల పార్టీ అని చెప్పారు. తెరాస ఇచ్చిన హామీల వైఫల్యాలపై త్వరలో ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం - The government fails to fulfill assurance
తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ దోమలగూడలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు.
హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం