డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాల సాధన కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెరాస రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్ అన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద విగ్రహానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు.
ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఫలాలే లక్ష్యం : లింగయ్య యాదవ్
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ట్యాంక్‌బండ్ వద్ద విగ్రహానికి తెరాస రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్ నివాళులర్పించారు. రాష్ట్రప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమం కోసం రూ.50 వేల కోట్లు కేటాయించిందని ఆయన తెలిపారు.
ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఫలాలు అందించడమే లక్ష్యం : లింగయ్య యాదవ్
బడుగు వర్గాల సంక్షేమం కోసం రాష్ట్రప్రభుత్వం రూ.50 వేల కోట్లు కేటాయించిందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగాన్ని రూపొందించిన మేధావి అంబేడ్కర్ అని కొనియాడారు. ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఫలాలు అందించడమే లక్ష్యంగా కేసీఆర్ పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్షనేతలు జూలకంటి రంగారెడ్డి, ఈటీ నరసింహ, రైతు సంఘం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి పాల్గొన్నారు.