ప్రపంచ భవిష్యత్ అంతా కృత్రిమ మేథపైనే ఆధారపడి ఉంటుందని మానవ భద్రత అధ్యయన సంస్థ వ్యవస్థాపకుడు డా.రమేశ్ అన్నారు. ఈ రంగంపై పట్టు సాధించిన దేశాలే అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. అమెరికా, చైనాతో పాటు ఇతర పాశ్చాత్య దేశాలూ కృత్రిమ మేథ విషయంలో ఎంతో ముందున్నాయన్నారు. మన దేశం ఈ రంగంలో పురోగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రపంచ భవిష్యత్ అంతా కృత్రిమ మేథపైనే: డా.రమేశ్ - hyderabad latest news
మానవ భద్రతకు కృత్రిమ మేథ ఎంతమేర వినియోగపడుతుందనే అంశంపై పరిశోధనలు చేస్తున్నట్లు మానవ భద్రత అధ్యయన సంస్థ వ్యవస్థాపకుడు డా.రమేశ్ తెలిపారు. కృత్రిమ మేథపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రపంచ భవిష్యత్ అంతా కృత్రిమ మేథపైనే: డా.రమేశ్
మానవ భద్రతకు కృత్రిమ మేథ ఎంత మేర ఉపయోగపడుతుందనే విషయంలో పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. కొన్ని సందర్భాల్లో కృత్రిమ మేథ వల్ల చెడు ఫలితాలూ వచ్చే అవకాశం ఉందని రమేశ్ పేర్కొన్నారు. సామాజిక బాధ్యతగా... కృత్రిమ మేథపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి దేశాభివృద్ధికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు.