తెలంగాణ

telangana

ETV Bharat / state

FTCCI ON BUDGET: బడ్జెట్​లో రాష్ట్ర ప్రాజెక్టుల ప్రస్తావనే లేదు: ఎఫ్‌టీసీసీఐ

FTCCI ON BUDGET: కేంద్ర బడ్జెట్‌ సామాన్యుడి ఆకాంక్షలను నెరవేర్చలేకపోయిందని ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు భాస్కర్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల ప్రస్తావన లేదని ఆరోపించారు. కేవలం వ్యవసాయ, మౌలిక రంగాలకు ప్రాధాన్యమిచ్చారని వెల్లడించారు.

FTCCI ON BUDGET
ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు భాస్కర్‌ రెడ్డి

By

Published : Feb 1, 2022, 2:25 PM IST

FTCCI ON BUDGET: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సంబంధించిన మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల ప్రస్తావన లేదని తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) అభిప్రాయపడింది. వ్యవసాయ, మౌలిక రంగాలతో పాటు ఎమ్​ఎస్​ఎమ్​ఈలకి ఊతం ఇచ్చేలా బడ్జెట్‌లో నిర్ణయాలున్నాయని ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు భాస్కర్‌ రెడ్డి తెలిపారు.

central budget: కేంద్ర బడ్జెట్‌ సామాన్యుడి ఆకాంక్షలను నెరవేర్చలేకపోయిందని భాస్కర్‌ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్​లో 2022-23 కేంద్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టారు.

ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు భాస్కర్‌ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details