ex mla vishnuvardhan reddy: హైదరాబాద్ జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి తన కూతురును విన్నూత రీతిలో పాఠశాలకు పంపించారు. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ విధించడంతో బడులు మూతపడ్డాయి. తాజాగా కరోనా తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి.
బడికి వినూత్నంగా బిడ్డను సాగనంపారు - హైదరాబాద్ తాజా వార్తలు
ex mla vishnuvardhan reddy: కరోనా కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి. కొద్దిరోజుల క్రితమే స్కూళ్లు మళ్లీ పునఃప్రారంభమయ్యాయి. దానికి తగ్గట్టుగానే పిల్లలను బడులకు ఆహ్వానించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు చాలాచోట్ల పువ్వులు, చప్పట్లతో స్వాగతం పలికారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే తన కూతురు చాలా రోజుల తరువాత బడికి వెళ్తుండటంతో వినూత్నంగా ఆలోచించి మంగళవాయిద్యాలతో పాఠశాలకు సాగనంపారు. ఇది చూసి అక్కడివారు ఆశ్చర్యానికి లోనయ్యారు.
మాజీ ఎమ్మెల్యే
ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత పాఠశాలకు వెలుతున్న కూతురు జనశ్రీ రెడ్డిని ఆయన మంగళ వాయిద్యాలతో బడికి సాగనంపారు. ఆమె కొండాపూర్‌లోని చిరెక్ పబ్లిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నారు. ఇది చూసి అక్కడివారు ఆశ్చర్యానికి లోనయ్యారు.