తెలంగాణ

telangana

ETV Bharat / state

సాయం చేసేందుకు ఈ చేతులెప్పుడూ ముందే - సాయం చేసేందుకు ఈ చేతులెప్పుడూ ముందే

ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్నా అని మదర్ థెరిస్సా చెప్పిన మాటలు వారి కదిలించాయో ఏమో... చదువుకునే వయసులోనే తమకు తోచిన సాయం చేస్తూ అందిరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఫ్లో ఆఫ్ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సభ్యులు.

సాయం చేసేందుకు ఈ చేతులెప్పుడూ ముందే

By

Published : Jul 31, 2019, 5:40 PM IST

సాయం చేసేందుకు ఈ చేతులెప్పుడూ ముందే

ఎవరైనా పేద ప్రజలకు అనారోగ్య సమస్యలు వచ్చినా, పాఠశాల ఫీజు కట్టేందుకు డబ్బు లేకపోయినా, అనాథ, వృద్ధాశ్రమాల్లో సామగ్రి లేకపోయినా... సాయం కోసం అడిగేందుకు ముందుగా గుర్తొచ్చేది ఫ్లో ఆఫ్ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థే. ఇందులో మొత్తం 350 మంది వాలంటీర్లు స్వచ్చంధంగా పనిచేస్తున్నారు. అలా అని వీరంతా ధనవంతులు అనుకోకండి. ఇందులో విద్యార్థులు, చిరుద్యోగులు కూడా ఉన్నారు. ఈ సంస్థను ఏర్పాటు చేసింది కూడా ప్రశాంత్ అనే ఓ ఇంటర్ చదివే విద్యార్థి.

ఫ్లో ఆఫ్ హెల్పింగ్ హ్యాండ్స్ వేదిక ద్వారా సాయం చేసేందుకు ఓ వాట్సప్ గ్రూపును ఏర్పాటు చేశారు. మహిళలకు, పురుషులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు ఇలా వేర్వేరు గ్రూపులను ఏర్పాటు చేశారు. ప్రతినెలా వీళ్లు ఓ క్యాలెండర్​ విడుదల చేస్తారు. అందులో ఉన్న తేదీల్లో ఖాళీగా ఉన్నవారు ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు అవసరమైన సామాగ్రిని అందిస్తుంటారు. తక్కువ మొత్తంలో డబ్బు సాయమైతే వాలంటీర్ నిధులు...ఎక్కువ కావాల్సి వచ్చినప్పుడు దాతలను సంప్రదిస్తుంటారు. హఫీజ్ పేటకు చెందిన ఉదయ్ అనే చిన్నారి క్యాన్సర్ రోగికి చికిత్సలు కూడా అందిస్తున్నారు. ఇప్పటికే మూడు లక్షలు ఖర్చు చేసిన వీళ్లు... మరో మూడు లక్షలు కూడా ఇచ్చి బాలుడి ప్రాణం కాపాడతామంటున్నారు.
అనాథ బాలలకు విమాన ప్రయాణ అనుభవం కల్పించాలన్న ఉద్దేశంతో ట్రూజెట్ విమానయాన సంస్థ వింగ్స్ ఆఫ్ హోప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ప్లో ఆఫ్ హెల్పింగ్ హ్యాండ్స్ సహకారంతో 30 మంది పిల్లలని గత జనవరిలో హైదరాబాద్ నుంచి కడపకు తీసుకెళ్లి అక్కడి పర్యాటక స్థలాలన్ని చూపించారు. విమానమే చూడని వాళ్లు... ఒక్కసారిగా విమానం ఎక్కి పర్యటక ప్రదేశాలన్ని చూడడంతో ఉబ్బితబ్బిబ్బయిపోయారు. తమతో మరింత మంది కలిస్తే... దేశంలోని ఉన్న చాలా మందికి సాయం చేయొచ్చని ఈ సంస్థ సభ్యులు చెబుతున్నారు.

ఇవీ చూడండి: చిరుత సంచారంతో భయాందోళనలో ప్రజలు

ABOUT THE AUTHOR

...view details