విమానంలో సాంకేతిక లోపం.. కర్ణాటక వెళ్లి హైదరాబాద్ వచ్చిన జేపీ నడ్డా - bandi sabha
16:21 December 15
జేపీ నడ్డా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం
JP Nadda reached telangana జేపీ నడ్డా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం చోటుచేసుకుంది. దిల్లీ నుంచి బయల్దేరిన జేపీ నడ్డా... సాంకేతిక లోపంతో కర్ణాటకలోని విద్యానగర్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అయ్యారు. మధ్యాహ్నం 2.10 గంటలకు శంషాబాద్‌కు జేపీ నడ్డా చేరుకోవాల్సింది. కానీ విమానంలో సాంకేతిక లోపంతో ఆలస్యంగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానశ్రయంలో జేపీ నడ్డాకు భాజపా నేతల స్వాగతం పలికారు. నడ్డాతో పాటు కిషన్‌రెడ్డి, రఘునందన్‌రావు, విజయశాంతి కరీంనగర్ వెళ్లారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ 5వ విడత పాదయాత్ర నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్‌లో ముగింపు సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఇప్పటికే ఈ సభకు ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో పాటు భారీగా ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు.
ఇవీ చూడండి: