మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలను తీవ్రంగా పరిగణిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ హెచ్చరించింది. కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి నేతృత్వంలో తొలి సమావేశం జరిగింది. 2020 సంవత్సరానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న 83 పిటిషన్లపై సమీక్షించారు. బాధిత మహిళల పునరావాసం, ఆర్థిక స్వావలంబన అంశాలపై చర్చించిన ఛైర్‌పర్సన్.. కమిషన్‌లో లీగల్ కౌన్సిలింగ్ కోసం ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. అనంతరం కమిషన్ సభ్యులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు.
'మహిళలపై ఆకృత్యాలు సహించేది లేదు'
రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి నేతృత్వంలో శుక్రవారం కమిషన్ తొలి సమావేశం జరిగింది. బాధిత మహిళల పునరావాసం, ఆర్థిక స్వావలంబన అంశాలపై చర్చించారు.
'మహిళలపై ఆకృత్యాలు సహించేది లేదు'