అందరికీ అసిస్టివ్ టెక్నాలజీ - అందుబాటు ధరలో అసిస్టివ్ టెక్నాలజీ అనే నినాదంతో డిసెంబర్ 3న తెలంగాణలో మొట్టమొదటి అసిస్టివ్ టెక్నాలజీ సదస్సు జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ దీనిని నిర్వహించనుంది.
తెలంగాణలో తొలిసారిగా అసిస్టివ్ టెక్నాలజీ సదస్సు - తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్
తెలంగాణలో మొట్టమొదటి అసిస్టివ్ టెక్నాలజీ సదస్సు డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ దీనిని నిర్వహించనుంది.
అసిస్టివ్ టెక్నాలజీ సదస్సు
ఈ సదస్సు ద్వారా అసిస్టీవ్ టెక్నాలజీకి సంబంధించి పని చేస్తున్న పరిశోధకులు, ఇన్నోవేటర్లు, పెట్టుబడిదారులు, ఎన్జీఓలు, ప్రభుత్వ సంస్థలు ఒక వేదిక ద్వారా వివిధ అంశాలపై చర్చించనున్నారు. టీ వర్క్స్ తో పాటు పలు ప్రైవేటు సంస్థలు, విద్యాసంస్థలు ఇందులో పాలు పంచుకోనున్నాయి. సదస్సులో భాగంగా... అసిస్టివ్ టెక్నాలజీ ప్రదర్శన, చర్చా గోష్ఠులు, ప్రముఖుల ప్రసంగాలు ఉండనున్నట్లు టీఎస్ఐసీ తెలిపింది.
- ఇదీ చూడండి :దేశంలో ఎక్కడాలేని విధంగా కమాండ్ కంట్రోల్ రూమ్'