తెలంగాణ

telangana

ETV Bharat / state

మొదటి వ్యాక్సిన్  నేనే తీసుకుంటా: ఈటల - Minister eetala rajender on vaccination news

రాష్ట్రవ్యాప్తంగా మొదటి డోసు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తాను టీకా తీసుకుంటానని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. తొలి, రెండో, మూడో విడత పరీక్షల అనంతరమే కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

రేపు మొదటి డోసు వ్యాక్సినేషన్... నేనూ టీకా తీసుకుంటా: ఈటల
రేపు మొదటి డోసు వ్యాక్సినేషన్... నేనూ టీకా తీసుకుంటా: ఈటల

By

Published : Jan 15, 2021, 5:51 PM IST

Updated : Jan 16, 2021, 6:06 AM IST

రాష్ట్రవ్యాప్తంగా మొదటి డోసు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లోని పారిశుద్ధ్య కార్మికులకు తొలి విడత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుందని వివరించారు. తొలి, రెండో, మూడో విడత పరీక్షల అనంతరమే కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

కరోనా వ్యాక్సినేషన్ డోసులు ఒకే కంపెనీవాటిని ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి మొదటి అరగంట పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. 18ఏళ్లు నిండినవారికి కరోనా టీకా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తాను కరోనా వ్యాక్సిన్ తీసుకుంటానని మంత్రి స్పష్టం చేశారు.

రేపు మొదటి డోసు వ్యాక్సినేషన్... నేనూ టీకా తీసుకుంటా: ఈటల

ఇదీ చూడండి:'వారంలో నాలుగురోజులు వ్యాక్సినేషన్... రేపే ప్రారంభం'

Last Updated : Jan 16, 2021, 6:06 AM IST

ABOUT THE AUTHOR

...view details