రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు మొదటిరోజు ప్రశాంతంగా ముగిశాయి. ఇవాళ ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్-1 ప్రశ్నపత్రం 'సెట్-ఏ'ను ఎంపిక చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా... మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగింది.
మొదటిరోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు - Inter exams news today
రాష్ట్రంలో మొదటిరోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. హైదరాబాద్లో ట్రాఫిక్ కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతించలేదు.
మొదటిరోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు
ఇంటర్ పరీక్షలకు 1,339 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 25,550 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో కనీసం నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు లోపలికి అనుమతించలేదు.
ఇవీ చూడండి:ఆరు నిమిషాల ఆలస్యం.. మొదటి పరీక్షకు దూరం