రాష్ట్రంలో ఓటర్ల జాబితా ముసాయిదాను ఇవాళ ప్రకటించనున్నారు. వచ్చే ఏడాది 2022 ప్రత్యేక సవరణ కార్యక్రమం ఆగస్టు నుంచి కొనసాగుతోంది. డూప్లికేట్ ఓట్ల తొలగింపు, ఇంటింటి పరిశీలన, పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, తదితర ప్రక్రియలు ఇప్పటి వరకు పూర్తయ్యాయి.
మార్పులు, చేర్పులతో పాటు కొత్త వారు కూడా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేస్తున్నారు. వాటన్నింటి ఆధారంగా ఇవాళ ముసాయిదా జాబితాను ప్రచురిస్తారు. దానిపై అభ్యంతరాలు, వినతులను ఈ నెల 30వ తేదీ వరకు స్వీకరిస్తారు. డిసెంబర్ 20వ తేదీ లోగా వాటన్నింటినీ పరిష్కరించి 2022 జనవరి ఐదో తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు.