కొవిడ్ రోగులకు చికిత్సలో ఉపయోగపడే ప్లాస్మాపై అవగాహన కల్పిస్తూ ఇటీవల వెబ్‌సైట్‌ను సైబరాబాద్ సిపీ సజ్జనార్ ఆవిష్కరించారు. ఇందులో భాగంగా ప్లాస్మా ఆవశ్యకతను వివరిస్తూ ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు రావాలంటూ సీపీ ట్విట్ చేశారు. ఇందుకు సినీ ప్రముఖులు స్పందించారు.
ప్లాస్మాదానంపై సీపీ సజ్జనార్ పోస్టుకు స్పందించిన సినీతారలు - ప్లాస్మాదానం గురించి సీపీ సజ్జనార్ ట్వీట్‌కు సినీ పరిశ్రమ స్పందన
ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలంటూ సైబరాబాద్ నగర సీపీ సజ్జనార్ ఇచ్చిన పిలుపుకు పలువురు ప్రముఖుల నుంచి స్పందన లభిస్తోంది. ప్లాస్మాను దానం చేసి పలువురి ప్రాణాలను కాపాడండి అంటూ మెగాస్టార్, ప్రిన్స్ మహేశ్‌బాబు, అనుష్క ఇలా పలువురు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ప్లాస్మాదానంపై సీపీ సజ్జనార్ పోస్టుకు స్పందించిన సినీతారలు
ప్లాస్మా దానం చేసి పలువురి ప్రాణాలను కాపాడడం గొప్ప విషయమని నటుడు మహేశ్ బాబు అన్నారు. టాలీవుడ్ హీరోయిన్ అనుష్క కూడా ప్లాస్మా దానం చేయాలని కోరింది. మెగాస్టార్ చిరంజీవి కూడా ప్లాస్మా దానం చేసి పలువురికి ప్రాణదానం చేయాలని సూచించారు. వీరితో పాటు సంగీత దర్శకుడు రఘుకుంచె, నటుడు సాయికుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.